ETV Bharat / bharat

గ్యాంగ్​స్టర్​ అతిఖ్​ అహ్మద్​కు జీవిత ఖైదు.. మరో ఇద్దరికీ.. - umesh pal hatyakand latest news

Umesh Pal Kidnapping Case : ఉమేశ్‌పాల్‌ అపహరణ కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత అతిఖ్‌ అహ్మద్‌ను ప్రజాప్రతినిధుల కోర్టు దోషిగా తేల్చింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.

Umesh Pal kidnapping case
Umesh Pal kidnapping case
author img

By

Published : Mar 28, 2023, 3:03 PM IST

Updated : Mar 28, 2023, 3:38 PM IST

Umesh Pal Kidnapping Case : ఉమేశ్​పాల్​ అపహరణ కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత అతిఖ్‌ అహ్మద్‌ను ప్రజాప్రతినిధుల కోర్టు దోషిగా తేల్చింది. 2006లో ఉమేశ్‌పాల్‌ అపహరణ కేసుకు సంబంధించి అతిఖ్‌ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అహ్మద్‌ సోదరుడు ఖలీద్‌ అజిమ్‌, మరో ఆరుగురిని ఈ కేసులో నిర్దోషులుగా తేల్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌ను.. కొందరు దుండగులు కాల్చిచంపారు. ఈ కేసులో అహ్మద్‌ అతిఖ్‌ సహా ముగ్గురిని ప్రయాగ్‌రాజ్‌ కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించింది. మరో కేసులో నిందితుడిగా ఉన్న అహ్మద్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉంచగా.. కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు.

సుప్రీం కోర్టులో చుక్కెదురు..
మరోవైపు సుప్రీంకోర్టులోనూ అతిఖ్​ అహ్మద్​కు చుక్కెదురైంది. ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరుతూ అతిఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బెలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించవచ్చని అతిఖ్ అహ్మద్​కు సూచించింది. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్​ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను తన పిటిషన్​లో ప్రస్తావించాడు. రాష్ట్రంలో మాఫీయాను మట్టిలో కలిపేస్తా(మాఫీయాకో మిట్టి మే మిలా దేంగే) అనే వ్యాఖ్యలు తనన ఉద్దేశించి చేసినవేనంటూ.. తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరాడు.

ఇదీ కేసు
2005లో జరిగిన BSP ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్య కేసులో అతిఖ్​ అహ్మద్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అయితే, రాజు పాల్‌ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడు అతిఖ్​తో పాటు పలువురిపై కిడ్నాప్‌ కేసు పెట్టాడు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే అతడు హత్యకు గురయ్యాడు. అయితే, ఉమేశ్‌ను హత్య చేసినట్లు భావిస్తోన్న ఓ వ్యక్తి మార్చి 14న జరిగిన పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ కేసులో అతీక్‌ అహ్మద్‌పైనా కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే 2006 నాటి అపహరణ కేసులో కోర్టు.. అతిఖ్​ అహ్మద్‌తోపాటు దినేష్‌ పాసీ, సౌలత్‌ హనీఫ్‌లను దోషులుగా తేల్చింది.

ఇవీ చదవండి : అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే.. పన్నీర్​ సెల్వంకు హైకోర్ట్ బిగ్ షాక్

'ఆ బంగ్లాతో ఎన్నో తీపి గుర్తులు.. మీరు చెప్పినట్టే ఖాళీ చేస్తా'.. రాహుల్​ గాంధీ లేఖ

Last Updated : Mar 28, 2023, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.