ETV Bharat / bharat

75ఏళ్ల వయసులో కరాటే.. రెండో ర్యాంక్​ బ్లాక్​ బెల్ట్​ కైవసం - మార్షల్​ ఆర్ట్స్​

Second Dan blackbelt in Karate: క్రిష్ణ, రామా అని అనుకుంటుూ ఉండాల్సిన వయసులో ఓ పెద్దాయన కరాటే కిక్కులతో అదరగొడుతున్నారు. 75 ఏళ్ల వయసులో కరాటేలో అత్యుత్తమంగా భావించే రెండో ర్యాంక్​ బ్లాక్​ బెల్ట్​ కైవసం చేసుకున్నారు. ఆయనే.. కేరళలోని ఇడుక్కికి చెందిన స్థానిక నాయకుడు ఎస్​టీ అగస్టీ.

Second Dan blackbelt in Karatte
75ఏళ్ల వయసులో కరాటే
author img

By

Published : Apr 29, 2022, 9:32 PM IST

75ఏళ్ల వయసులో రెండో ర్యాంక్​ కరాటే బ్లాక్​ బెల్ట్​

Second Dan blackbelt in Karate: నేర్చుకునే తపన ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఓ వృద్ధుడు. 58 ఏళ్లకు కరాటే నేర్చుకోవటం ప్రారంభించి.. 75 ఏళ్ల వయసులో రెండో ర్యాంక్​ బ్లాక్​ బెల్ట్​ సాధించి ఔరా అనిపించారు. తన కిక్కులతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనే.. కేరళ, ఇడుక్కికి చెందిన ఎస్​టీ అగస్టీ. గతంలో ఇడుక్కిలోని కామాక్షి గ్రామ సర్పంచ్​గానూ చేశారు. ఆయనను అచోయ్​ అన్న అని పిలుస్తారు.

రోజులో ఎక్కువ సమయాన్ని మార్షల్​ ఆర్ట్స్​​ సాధన కోసం ఉపయోగిస్తారు అగస్టీ​. ఈ విద్యలో నైపుణ్యం సాధించాలంటే శారీరక దృఢత్వం చాలా అవసరం. మాస్టర్​ కవలక్కట్​ జోష్​​ ఆధ్వర్యంలో తనలోని కరాటే నైపుణ్యాన్ని ప్రదర్శించి సెకండ్​ డాన్​ బ్లాక్​ బెల్ట్​ సొంతం చేసుకున్నారు అగస్టీ​. కరాటేలో ఈ స్థాయికి రావటం అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా పెద్ద వయసులో నేర్చుకోవటం ప్రారంభించిన వారికి మరింత కఠినంగా ఉంటుంది. అగస్టీ ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉంటారు. శారీరక దృఢత్వంలో యువకులతో పోటీ పడతారు. నేర్చుకోవటం ప్రారంభించిన నాలుగేళ్లలోనే మొదటి ర్యాంక్​ బ్లాక్​ బెల్ట్​ సాధించారు​.

మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకోవాలనే తపన, నిబద్ధతకు అగస్టీ​ నిదర్శనమని ఆయన మాస్టర్​ కవలక్కట్​ జోష్​ తెలిపారు. అదే కరాటేలో ఈ స్థాయికి చేరుకునేందుకు ఉపయోగపడిందన్నారు. ప్రతిరోజు కరాటే సాధనం చేయటం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తన ధరి చేరలేదని చెప్పారు అగస్టీ​.

" మా పిల్లలు కరాటే నేర్చుకునేందుకు వెళ్తుండటం వల్ల నాకు ఆసక్తి కలిగింది. నా 58 ఏళ్ల వయసులో కవలక్కట్​ జోష్​ మాస్టర్​ వద్ద కరాటే నేర్చుకోవటం ప్రారంభించాను. 62 ఏళ్ల వయసులో మొదటి డాన్​ బ్లాక్​ బెల్ట్​ సాధించాను. ఈ వయసులో కరాటేలో నా నైపుణ్యాన్ని ప్రదర్శించగలగటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది."

- అగస్టీ​

కరాటే, వ్యాయామం చేయటం వల్ల తాను ఒత్తిడికి లోనవ్వనని, మధుమేహం, చెడు కొవ్వు వంటివి లేవన్నారు అగస్టీ. ఈ వయసులో ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు వ్యాయామం చాలా మంచిదని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం మహిళలు, చిన్నారులు ఈ మార్షల్​ ఆర్ట్స్​ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే.. 70 ఏళ్ల వయసులో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.