ETV Bharat / bharat

మద్యం హోం డెలివరీకి మరో రాష్ట్రం గ్రీన్​సిగ్నల్ - అసోం ఆన్​లైన్ మద్యం విక్రయాలు

ఆన్​లైన్ మద్యం అమ్మకాలకు మరో రాష్ట్రం పచ్చజెండా ఊపింది. ఆన్​లైన్ విక్రయాల తొలి విడతను ప్రారంభించింది. విదేశీ మద్యం, బీర్లు, నాటు సారా వంటి ఉత్పత్తులను విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది.

liquor home delivery in assam
అసోం ఆన్​లైన్ మద్యం విక్రయాలు
author img

By

Published : Jul 24, 2021, 8:29 AM IST

అసోంలో లిక్కర్ ఆన్​లైన్ అమ్మకాలకు తెరతీసింది అక్కడి భాజపా సర్కారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరమైన గువాహటిలో దీన్ని ప్రారంభించింది. క్రమంగా ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించనుంది.

ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన అసోం అబ్కారీ శాఖ. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. మద్యం దుకాణాల ముందు భారీగా జనం గుమిగూడకుండా ఉంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. విదేశీ మద్యం, బీర్లు, నాటు సారా తదితర ఉత్పత్తులను ఆన్​లైన్ ద్వారా విక్రయించనున్నట్లు స్పష్టం చేసింది.

వారికి నో!

ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం హోం డెలివరీ అందుబాటులో ఉంటుంది. అర్హులైన వినియోగదారులు మూడు లీటర్ల వరకు మద్యాన్ని ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ ఏజెంట్లు ఒకేసారి 9 లీటర్లకు మించి మద్యాన్ని తమ వెంట ఉంచుకునే వీలు లేదు. అయితే, హాస్టళ్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా ప్రదేశాలకు వీటి డెలివరీ ఉండదు.

బంగాల్, ఒడిశా, ఛత్తీస్​గఢ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే మద్యం హోం డెలివరీని ప్రారంభించాయి.

ఇదీ చదవండి: ఈ నెల 14 నుంచి మద్యం 'హోమ్​ డెలివరీ'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.