Boat capsized : కాసేపట్లో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాల్సిన పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా వరద నీటిలో పడిపోయారు. ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే? జిల్లాలోని అథహత గ్రామం.. గత కొన్నిరోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ముంపుకు గురైంది. ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఓ డీజల్ బోటును పంపారు. బోట్ బయలుదేరిన సమయంలో అందులో దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. అయితే కొద్ది దూరం ప్రయాణించాక ఆ పడవ అకస్మాతుగా వేగం తగ్గడం ప్రారంభించి మునిగిపోయింది.
అందులో ఉన్న ప్రయాణికులంతా నీట మునిగారు. విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు హుటాహుటిన అక్కడికి వచ్చి దాదాపు 12 మందిని రక్షించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వారిని ట్రాక్టర్‌పై భదౌరాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఇద్దరు మరణించారని వైద్యులు నిర్ధరించారు. ఇంకా ఆరుగురు గల్లంతయ్యారు. వారిని వెతికేందుకు గ్రామస్థులు శ్రమిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఉగ్ర సంస్థలతో లింకులు'.. బుల్డోజర్తో మదర్సా కూల్చివేత
'మా వర్గం అమ్మాయితో మాట్లాడతావా?'.. యువకుడ్ని చితకబాదిన క్లాస్మేట్స్