Army Rescued Kerala youth: కేరళలోని పాలక్కడ్‌లో పర్వతారోహణకు వెళ్లి కొండ చీలికలో చిక్కుకుపోయిన బాబు అనే యువకుణ్ని సైన్యం రక్షించింది. రెండు రోజులకుపైగా కొండల్లోనే ఉన్న బాబును క్షేమంగా అక్కడి నుంచి తీసుకువచ్చింది.




23ఏళ్ల బాబు అనే యువకుడు సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి మలప్పుజ ప్రాంతంలో కొండ శిఖరం ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని ఇద్దరూ స్నేహితులు మధ్యలోనే విరమించుకున్నప్పటికీ బాబు విజయవంతంగా కొండశిఖరం చేరుకున్నాడు. అయితే ఉన్నట్టుండి కిందకు జారి కొండచీలిక మధ్యలో ఇరుక్కుపోయి రెండు రోజులుగా తిండీనీళ్లులేక ఇబ్బందులు పడ్డాడు. బాబును కాపాడేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తీరప్రాంత రక్షక దళ హెలికాఫ్టర్ ప్రయత్నించినప్పటికీ అతని దగ్గరకు చేరుకోలేకపోయాయి. సీఎం పినరయి విజయన్ సైన్యం సాయం కోరగా.. రెండు ఆర్మీ బృందాలు ఇవాళ తెల్లవారుజామున రంగంలోకి దిగి బాబును సురక్షితంగా కాపాడాయి.


ఇదీ చదవండి: పంజాబ్ ఎన్నికల వేళ.. పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం!