ETV Bharat / bharat

Army Dog Kent Died : ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన వీర శునకం మృతి.. కాల్పుల్లో ముగ్గురు సైనికాధికారులు మృతి - ఆర్మీ డాగ్ కెంట్ మృతి

Army Dog Kent Died : జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల వేట ముమ్మరంగా కొనసాగుతున్న వేళ.. ఓ విషాద వార్త తెలిసింది. ముష్కర మూక వేటలో భారత సైన్యానికి చెందిన ఓ జాగిలం ప్రాణాలు కోల్పోయింది. సైనికుడిని కాపాడే ప్రయత్నంలో ఆ జాగిలం తన ప్రాణాలు అర్పించింది. సైనిక జాగిలం మృతిపై సైనికాధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

army dog kent died
army dog kent died
author img

By PTI

Published : Sep 13, 2023, 2:02 PM IST

Updated : Sep 14, 2023, 6:29 AM IST

Army Dog Kent Died : జమ్ముకశ్మీర్‌ రాజౌరీ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మరో విషాదం జరిగింది. ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నంలో ఓ సైనికుడు అమరుడవ్వగా.. సైనిక జాగిలం కూడా ప్రాణాలు అర్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నక్కి ఉన్న ఉగ్రవాదుల్ని ఆపరేషన్‌ సుజలిగల పేరుతో సైనిక దళాలు గాలిస్తుండగా ఈ విషాదం జరిగింది. అదేసమయంలో.. ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఆపరేషన్‌ 'సుజలిగల' సైనిక దళాన్ని కెంట్‌ అనే జాగిలం ముందుండి నడిపించింది. లాబ్రడార్‌ జాతికి చెందిన ఈ ఆడ జాగిలం వయసు ఆరేళ్లు. ట్వంటీ వన్‌ ఆర్మీ డాగ్‌ యూనిట్‌లో కెంట్‌కు సైన్యం శిక్షణ ఇచ్చింది. ముష్కర వేటలో భాగంగా సైనికులతో పాటు అప్పటిదాకా ఉత్సాహంగా కెంట్‌ ముందుకు నడిచింది. ఆ సమయంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు.. ఒక్కసారిగా కెంట్‌ను పట్టుకున్న సైనికుడిపై కాల్పులకు దిగారు. సైనికుడి ప్రాణాలు కాపాడేందుకు కెంట్‌.. బుల్లెట్లకు అడ్డుగా రక్షణ కవచంలా నిలిచింది. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది.

  • Sad news coming in-

    Brave Canine Warrior KENT of 21 Army Dog Unit laid down her life serving in ongoing OP SUJALIGALA at Rajouri, J&K earlier today - 12 September 2023.

    The six year old female Labrador was leading a column of soldiers on the trail of fleeing terrorists. The… pic.twitter.com/L5j7MDZNiX

    — LestWeForgetIndia🇮🇳 (@LestWeForgetIN) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో మంగళవారం నుంచి సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మంగళవారం ఒక ముష్కరుడిని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు అమరుడయ్యాడు. ఒక పోలీసు S.P.Oతో సహా ముగ్గురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి.

ముగ్గురు అధికారులు మృతి..
అలాగే అనంతనాగ్​లో బుధవారం ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడటం వల్ల ముగ్గురు అధికారులు అమరులయ్యారు. ఒక జవాను ఆచూకీ తెలియరాలేదు. అనంతనాగ్‌ జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఆర్మీ కర్నల్‌, మేజర్‌, డీఎస్పీ ప్రాణత్యాగం చేశారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ నిషేధిత రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి గడోల్‌ ప్రాంతంలో.. భద్రతాదళ సిబ్బంది ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగి.. బుధవారం అర్థరాత్రి వరకు కొనసాగాయి. బుధవారం ఉదయం ఓ రహస్య ప్రాంతంలో.. ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది. కర్నల్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడం వల్ల కర్నల్‌ మన్‌ప్రీత్‌సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధోనక్‌, జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్‌ భట్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పరిస్థితి విషమించి వారు తుదిశ్వాస విడిచారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి..
గత నెల(ఆగస్టు5) తేదీన కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు వెళ్లిన సైనికులు.. హలాన్‌ అటవీ ప్రాంతంలో అమరులుగా మారారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడ తనిఖీలు చేపట్టాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వీరశునకం 'జూమ్'​ మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. నివాళులు అర్పించిన ఆర్మీ అధికారులు

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

దేశానికి సేవ చేసిన రియల్‌ హీరో: రాజ్​నాథ్​​

Last Updated : Sep 14, 2023, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.