ETV Bharat / bharat

'చైనాతో చర్చలు.. ప్రతిసారి ఫలితాలు రావు' - భారత్​ చైనా

ఈ నెల 11న జరిగిన భారత్​- చైనా సరిహద్దు చర్చల(india china border news) నేపథ్యంలో ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు(india china news). చైనాతో జరిగే చర్చల్లో ప్రతిసారీ ఫలితాలు రావాలి అని ఆశించకూడదన్నారు.

Army Chief naravane
'చైనాతో చర్చలు.. ప్రతిసారి ఫలితాలు రావు'
author img

By

Published : Oct 22, 2021, 8:21 AM IST

సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్​ ఆశించకూడదని ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె తెలిపారు(india china border news). చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్​-చైనా మధ్య జరిగిన 13వ దఫా చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు(india china news).

"సరిహద్దు విషయంలో భారత్​-చైనా మధ్య 4-5 అంశాల్లో విభేదాలుండేవి. వాటిల్లో ఒక్కటి తప్ప మిగిలినవి పరిష్కరిచుకున్నాం. రానున్న చర్చల్లో ఆ ఒక్క సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాము. కానీ దానికి ఎన్ని దఫాల చర్చలు అవసరమనేది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే తూర్పు లద్ధాఖ్​లో పరిస్థితులు మునుపటి కన్నా మెరుగ్గా ఉన్నాయి. నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. ప్రతి చర్చలోనూ ఫలితాలు మనకు అనుకూలంగా రావాలి అని ఆశించకూడదు. ఏదో ఒక చోట విభేదాలు తలెత్తుతాయి. చర్చలు సాగినంత కాలం, ఆ విభేదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది."

-- ఎమ్​ఎమ్​ నరవణె, ఆర్మీ చీఫ్​.

భారత్​-చైనా మధ్య గతేడాది మే నెల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. 12 దఫాల చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఇరువైపులా అధికారులు కృషి చేశారు. అయితే అక్టోబర్​ 11న 13వ దఫా చర్చల్లో పురోగతి లభించలేదు. తాము ఇచ్చిన నిర్మాణాత్మక సూచనలను చైనా అధికారులు అంగీకరించలేదని భారత సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

'రెండు దేశాలకూ అవసరమే..'

సరిహద్దు ప్రాంతాల్లో శాంతి.. ఇరు దేశాలకూ అవసరమేనని అభిప్రాయపడ్డారు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. రెండువైపులా సున్నితమైన, ప్రయోజనకరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే దిశగా చైనా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నట్టు స్పష్టం చేశారు. తూర్పు లద్ధాఖ్​లో ఉద్రిక్తతల వల్ల ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం ఏర్పడిందని, అది ఇరు దేశాల బంధం మీద ప్రభావం చూపిందని అన్నారు. దిల్లీలో జరిగిన 'లెవరేజింగ్​ చైనా ఎకానమీ' సెమినార్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చూడండి:- 'సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు- మేమూ వెనక్కి తగ్గం'

'ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా బదులిస్తాం'

సరిహద్దుల్లో నిత్యం.. మృత్యువుతో యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.