ETV Bharat / bharat

State Wide TDP Supporters Protest Against Chandrababu Arrest చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌కి అడ్డుపడుతున్న టీడీపీ శ్రేణులు..! నేషనల్ హైవే పై ఉద్రిక్త పరిస్థితులు.. - చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు

AP TDP Supporters Protest Against Chandrababu Arrest on Highways చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు భగ్గమన్నాయి. బాబును విజయవాడకు తరలిస్తున్న కాన్వాయ్‌కి టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబును తరలిస్తున్న... జాతీయ రహదారిపై టైర్లు కాల్చి, బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

AP TDP Supporters Protest Against Chandrababu Arrest on Highways

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 5:08 PM IST

Updated : Sep 9, 2023, 5:18 PM IST

AP TDP Supporters Protest Against Chandrababu Arrest on Highways: చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగుదేశం అధినేత అరెస్టు అక్రమమంటూ.... పార్టీ నేతలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆధారాల్లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును విజయవాడకు తీసుకెళ్తున్న కాన్వాయ్‌కు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. బాబును తీసుకెళ్లడానికి వీల్లేదంటూ.... వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చి.... పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చిలకలూరిపేటలో అరగంటకుపైగా వాహన శ్రేణి నిలిచిపోయింది.

జాతీయ రహదారిపై బైఠాయిం ఆందోళనలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు: చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమంటూ... ఆందోళన బాట పట్టారు. నంద్యాల నుంచి ఆయన వస్తున్న కాన్వాయ్‌కు అడ్డుపడుతూనే ఉన్నారు. ఒంగోలులో కార్యకర్తలంతా ఒక్కసారి రోడ్డుపైకి వచ్చి... వాహన శ్రేణిని అడ్డగించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా... జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ‌్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

Parchur Constituency పర్చూరు నియోజకవర్గం: పంగులూరులోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు కాన్వాయ్‌ని చూసి... ఒకేసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. వాహనాలకు అడ్డుకునేందుకు యత్నించారు. చంద్రబాబును విడిచిపెట్టాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌కి(Police baton charge) యత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

State Wide TDP Supporters Protest Against Chandrababu Arrest చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌కి అడ్డుపడుతున్న టీడీపీ శ్రేణులు..! నేషనల్ హైవే పై ఉద్రిక్త పరిస్థితులు..

Chandrababu Naidu Arrested by AP CID : చంద్రబాబు అరెస్టు దేనికి సంకేతం..! ఇప్పుడే ఎందుకు..? వివేకా కేసు దృష్టి మళ్లింపా..? పోలీసులకూ.. కళంకమే!

Adnaki Constituency అద్దంకి నియోజకవర్గం: ముప్పవరంలో.... తెలుగుదేశం కార్యకర్తలు ధర్నాకు దిగారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌ని నిలిపివేశారు. భారీగా తరలివచ్చిన తెలుగు దళాన్ని... నిలువరించేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు.... పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల దాడిలో ఓ వ్యక్తి కంటికి తీవ్ర గాయమైంది. పోలీసుల జులుంపై టీడీపీ కార్యకర్తలు ధ్వజమెత్తారు.

Chilakaluripet చిలకలూరిపేట: తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రబాబును అరెస్టును వ్యతిరేకిస్తూ.... జాతీయ రహదారిపై టీడీపీ నేతల రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి పుల్లారావు ఆధ్వర్యంలో వేలాదిగా టీడీపీ శ్రేణులు తరలివచ్చి... చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై(National Highway) భారీగా నేతలు, మహిళలు బైఠాయించారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అరగంటకుపైగా చంద్రబాబును తరలిస్తున్న వాహన శ్రేణి నిలిచిపోయింది. వాహనం దిగివచ్చి దారి ఇవ్వాలని కార్యకర్తలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయినా పట్టు విడవకుండా అక్కడే బైఠాయించారు. మరోసారి అధినేత చెప్పడంతో చివరకు కాన్వాయ్‌కు దారిచ్చారు.

Vijayawada City Court Complex విజయవాడ సిటీ కోర్ట్ కాంప్లెక్స్: వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్ట్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళన చేస్తున్న మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు వెళ్లే రహదారుల్లో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

Last Updated : Sep 9, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.