AP Police Support To YSRCP Anarchy : కుటుంబంపై దాడి చేసి కొట్టారని న్యాయం కోసం పోలీసుస్టేషన్ మెట్లెక్కిన బాధితుడినే పోలీసులు చితకబాదారు.ఫ్లెక్సీలు చింపివేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేయడమే ఆలస్యం దళిత యువకుడిని ఆఘమేఘాలపై స్టేషన్‌కు తరలించి అక్రమంగా నిర్బంధించారు. పోలీసులు చేసిన అవమానభారంతో నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో బాలనరసింహులు ఆత్మహత్య ఘటన మరువక ముందే తాజాగా ఏపీ హోంమంత్రి తానేటి వనిత Home (Minister Taneti Vanita) ఇలాకాలో మరో యువకుడు మహేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రశ్నించే వారిన, ప్రతిపక్షాలను అధికారపార్టీ నేతల ఆదేశాలతో కొందరు పోలీసులు అక్రమంగా నిర్బంధించి అవమానిస్తున్నారు. దీంతో బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిలో దళితులే అత్యధికులు ఉండటం విచారకరం.
ఆర్మీ జవాన్‌పై పోలీసుల అరాచకం - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా మూకుమ్మడి దాడి
Police Brutality Behavior On Victims In YCP Government : తెలిసో తెలియక చిన్నచిన్న పొరపాట్లు చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన పోలీసులు.. అధికారపార్టీ నాయకుల మెప్పుకోసం కొందరు లాఠీలకు పని చెబుతున్నారు. ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా వారిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులే దాడులకు పాల్పడుతున్నా.. వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పెద్దఎత్తున ఆందోళనలు జరిగితే సంబంధిత పోలీసులను వీఆర్‌కు పంపడం, సస్పెన్షన్ లాంటి నామమాత్ర చర్యలతో సరిపెడుతున్నారు తప్ప గట్టి హెచ్చరికలు పంపేలా కఠిన చర్యలు చేపట్టడం లేదు. కొన్ని ఘటనల్లో కేసులు పెట్టినా శిక్షలు పడటం లేదు. ఉన్నతాధికారుల ఉదాసీనతే పోలీసుల ఆగడాలకు దారితీస్తోంది.
పోలీసుల తీరుతో ఆత్మహత్యలు:-
- అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య : పోలీసుల దాష్టీకంతో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య (Abdul Salams family Committed Suicide) చేసుకోవడంతో జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- పోలీసుల దాడి : కోనసీమ జిల్లా మండపేటలో పోలీసుల తీవ్రంగా కొట్టడంతో అవమానభారంతో కాళీకృష్ణ భగవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- పోలీసుల బెదిరింపులు : శ్రీకాకుళం జిల్లా పొత్తంగిలో పోలీసుల బెదిరింపులతో కోన వెంకట్రావు బలవన్మరణం పొందాడు.
- ప్రతిపక్షాలను పొగిడినా వేధింపులే : పోలీసుల చెర నుంచి విడిపించిన తెలుగుదేశం నేతను పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని NTR జిల్లా కంచికచర్లకు చెందిన రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడిని పోలీసులు మళ్లీ వేధించటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
- సైనికోద్యోగి సయ్యద్ అలీముల్లాపై దాష్టీకం.. కేసు పెట్టరు : దిశయాప్ బలవంతంగా డౌన్లోడ్ చేయించి, ఓటీపీ అడిగిన కానిస్టేబుళ్లను ప్రశ్నించినందుకు సైనికోద్యోగి సయ్యద్ అలీముల్లాపై పరవాడ పోలీసులు దాష్టీకానికి తెగబడితే బాధ్యులపై ఇప్పటికీ కేసే పెట్టలేదు.
- కేసు నమోదు చేయరు : కాకినాడలో తన కారులోనే కూర్చుని స్నేహితుడితో కలిసి భోజనం చేస్తున్న వైద్యుడ్ని పోలీసులు విచక్షణరహితంగా లాఠీలతో చితకబాదారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే బాధితుడినే తెల్లవారుజాము వరకు స్టేషన్లో కూర్చోబెట్టి కేసు నమోదు చేయకుండానే వెనక్కి పంపేశారు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పోలీసుల తీరుతో ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కోకొల్లలు. అధికార దర్పం ప్రదర్శిస్తూ అకారణంగా చేయిచేసుకోవడం, పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటనలపైనా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
నోట్లో గుడ్డలు కుక్కి, బూటు కాళ్లతో తన్ని - పుంగనూరులో సీఐ దాష్టీకం
ముఖ్యంగా దళిత యువకులపైనే పోలీసులు దాష్టీకాలకు పాల్పడుతున్నారు:-
- మూత్రం తాగాలని ఎస్సై హుకూం : ఓ మహిళ అదృశ్యం కేసులో అనుమానితుడికి ద్విచక్ర వాహనం ఇచ్చాడంటూ తూర్పుగోదావరి జిల్లా కుంకుడుమిల్లికి చెందిన దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్‌ను కడియం పోలీసులు చితకబాదారు. దాహం వేస్తోందని, మంచినీళ్లు ఇప్పించాలని వేడుకోగా.. మూత్రం తాగాలంటూ ఎస్సై అవమానించడం సిగ్గుచేటు.
- విచక్షణరహితంగా కొట్టడం : కోళ్ల దొంగతనం కేసులో విశాఖ జిల్లా బాందేవపురానికి చెందిన దళిత యువకుడిని పోలీసులు విచక్షణరహితంగా కొట్టడంతో అతని కాలు విరిగిపోయింది.
- పోలీసుస్టేషన్లోనే శిరోముండనం : తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువకుడు ప్రసాద్‌కు పోలీసుస్టేషన్లోనే శిరోముండనం చేశారు.
Police Brutality in AP : ఈ తప్పులన్నీ పోలీసు ఉన్నతాధికారులకు కనిపించడం లేదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.