పోలింగ్ బూత్‌ల స్వాధీనం, బోగస్ ఓట్ల వంటి అరాచకాలపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు.. చట్టబద్ధ పాలనకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొంది. 1989 నవంబరు 26న జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అప్పటి బిహార్ (ఇప్పటి రూర్ఖండ్) రాష్ట్రంలోని పాటాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోల్హాన్ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ జరిగింది.
ఆ ఘర్షణలో ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్న భాజపా కార్యకర్తను 15 మంది వ్యక్తులు అడ్డగించి చేతిలోని పత్రాలను లాక్కొన్నారు. దీనిపై కేసు నమోదు కాగా కింది కోర్టు వారికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. దీనిపై వారు అపీలు చేయగా న్యాయమూర్తులు జస్టిస్ డి వై.చంద్రచూడ్, ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి నిరాకరించింది.
ఇదీ చూడండి: సుప్రీంకు 'పెగాసస్' వ్యవహారం- సిట్ దర్యాప్తునకు విజ్ఞప్తి
ఇదీ చూడండి: 'ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు- శిక్ష పడింది ఆరుగురికే!'