ETV Bharat / bharat

'ఆయన'తో లవ్​ ట్రాక్​ నడిపేందుకు మత్తు మందు ఇంజెక్షన్​తో డాక్టర్​ను చంపిన భార్య!

ఆపరేషన్​ కోసం మత్తు మందు ఇచ్చే డాక్టర్​కే అనస్థీషియా ఇంజెక్షన్​ ఇచ్చి చంపింది ఓ మహిళ. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని హత్య చేసేందుకు ప్రయత్నించగా ఆయన 33 రోజులు కోమాలో ఉండి గురువారం మృతి చెందారు.

anesthesia given to doctor
Anesthesia injection given by wife to doctor
author img

By

Published : Oct 14, 2022, 11:34 AM IST

తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్​ చేసే డాక్టర్​ను అదే మత్తుమందుతో హత్య చేసింది. దాదాపు 33 రోజుల పాటు కోమాలో ఉన్న డాక్టర్ సతీశ్​ కేశవ్​రావ్​ గురువారం మృతిచెందారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్​లో జరిగింది.

అసలేం జరిగిందంటే..
సతీశ్ కేశవ్​రావ్​ అనే వ్యక్తికి నాసిక్​లో ఓ ప్రైవేట్​ ఆస్పత్రి ఉంది. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. సుహాసిని అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కొన్నేళ్ల క్రితం ఆయన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన్ను రిమాండ్​కు తరలించారు. కోర్టు ఆరేళ్ల శిక్ష ఖరారు చేసింది. శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆయన రెండో భార్య సుహాసిని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ వారి పెళ్లయిన కొన్నేళ్లకే ఆ వ్యక్తి గుండెపోటతో మరణించాడు.

అరుణ్​ కండేకర్​ అనే వ్యక్తి తన భార్యకు కరోనా సోకగా ఆమెను డాక్టర్​ సతీశ్​కు చెందిన ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ అరుణ్​కు, సుహాసినికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ రిజిస్టర్​ మ్యారేజ్​ సైతం చేసుకున్నారు. కానీ ఈ విషయం సతీశ్​కు తెలియదు. శిక్షా కాలం పుర్తి చేసుకుని వచ్చాక సతీశ్​కు సుహాసిని-అరుణ్​ సంబంధం గురించి తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయిన డాక్టర్ సతీశ్​..​ ఆస్పత్రిలో ఉన్న వారిద్దరినీ నిలదీశారు. సెప్టెంబర్ 10న ఈ విషయమై వారి ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది.

వాగ్వాదం తర్వాత రెస్ట్​రూమ్​కు వెళ్లిన సతీశ్​కు మత్తు ఇంజెక్షన్​ ఇచ్చింది సుహాసిని. స్పృహ తప్పి పడిపోయిన సతీశ్​ కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు 33 రోజులు అలానే ఉన్నారు. చికిత్స పొందుతూ​ గురువారం మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. మృతుని కుమారుడు ప్రతీక్​ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: నగరంలో మెట్రో రైలు పనులు.. ఇళ్లల్లో పగుళ్లు.. జనం పరుగో పరుగు!

ఆన్‌లైన్లో విడుదలయ్యే సినిమాలపై కమిటీ ఎలా వేయగలం?: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.