ETV Bharat / bharat

వృద్ధుడి గొప్ప సంకల్పం.. మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..! - అమరావతిలో తాగునీటిని పంపిణి చేస్తున్న వ్యక్తి

Amravati waterman: మండుటెండలో అడవి మార్గంలో ప్రయాణించే చిరు వ్యాపారుల కోసం 26 ఏళ్లుగా జలయజ్ఞం చేస్తున్నాడు ఓ సామాన్యుడు. వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే ఉండి.. అటువైపు వచ్చేవారికి చల్లటి మంచి నీరు అందిస్తున్నాడు. మూగ జీవాల కోసం నీటి తొట్టెలు నిర్మించి.. వాటి దాహార్తిని తీర్చుతున్నాడు.

Amravati waterman
వాటర్​మ్యాన్
author img

By

Published : May 4, 2022, 2:34 PM IST

ప్రయాణికులకి చల్లని నీరు అందిస్తున్న వివేక్ చర్జన్

Amravati waterman: అడవి మార్గంలో వెళ్లే వారి దాహాన్ని తీర్చుతున్నాడు అతడు. మూగ జీవాల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి మంచి మనసును చాటుకుంటున్నాడు. గత 26 ఏళ్లుగా ఈ సేవలను కొనసాగిస్తున్నాడు మహారాష్ట్ర అమరావతికి చెందిన వివేక్ చర్జన్. అందుకే అతడ్ని ఆ ప్రాంతవాసులంతా 'వాటర్​మ్యాన్​' అని పిలుచుకుంటారు.

Amravati waterman
ప్రయాణికులకు చల్లని నీరు అందిస్తున్న వివేక్ చర్జన్
Amravati waterman
ద్విచక్రవాహనదారుడికి నీరు అందిస్తున్న వాటర్​మ్యాన్

అమరావతి-చండూర్​ రహదారి.. పోహ్రా, చిరోడి అడవుల గుండా సుమారు 15-20 కిలోమీటర్లు ఉంటుంది. పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు ఈ దారిలో ఎక్కువగా ప్రయాణిస్తారు. వీరిలో చాలా మంది ప్రయాణానికి సైకిల్, మోటర్ బైక్​ వాడతారు. వేసవి కాలంలో వీరి దాహం తీర్చేందుకు తనవంతు ప్రయత్నిస్తున్నాడు వివేక్. ఉదయం 10 గంటల నుంచి ఆ మార్గంలో వెళ్లేవారికి చల్లటి నీరు అందిస్తున్నాడు.

Amravati waterman
చల్లటి మంచి నీరుని అందిస్తున్న వివేక్

అసలే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 42-43 డిగ్రీలు నమోదవుతున్నాయని అంటున్నాడు వివేక్. దీని వల్ల ప్రయాణికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున చల్లని మంచి నీటిని అందిస్తున్నానని చెబుతున్నాడు. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలలు సహా జూన్​లో మొదటి రెండు వారాలు ఇలా తాగునీటిని ప్రయాణికులకు అందిస్తానని అంటున్నాడు.

Amravati waterman
మూగ జీవాల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసిన వివేక్ చర్జన్

ఇదీ చదవండి: సందడి సందడిగా 'చేపల పండగ'- ఈ ఏడాది జోరుగా వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.