ETV Bharat / bharat

వారణాసిలో మసీదు సర్వేపై హైకోర్టు స్టే!

గ్యాన్వాపి మసీదులో.. ఆర్కియాలజీ సర్వేపై అలహాబాద్ హై కోర్టు స్టే విధించింది. వారణాసి ఫాస్ట్రాక్​ కోర్టు ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ.. ఉత్తర్​ ప్రదేశ్ సునీ వక్ఫ్​ బోర్డ్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Allahabad High Court
అలహాబాద్ హై కోర్టు
author img

By

Published : Sep 9, 2021, 7:16 PM IST

ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలోని గ్యాన్వాపి మసీదుపై భారత సర్వే విభాగం (ఏఎస్​ఐ) చేస్తున్న సర్వేపై స్టే విధించింది అలహాబాద్ హైకోర్టు. సర్వేకు అనుకూలంగా వారణాసి దిగువకోర్టు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ.. గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

సర్వే దేనికి?

గ్యాన్వాపి మాసీదు కాంప్లెక్స్​ ఉన్న ప్రాంతంలో ఇంతకు ముందు ఏదైనా ఆలయం ఉండేదా? అని తెలుసుకునేందుకు వారణాసి ఫాస్ట్రాక్​ కోర్టు.. సర్వే చేసేందుకు ఏప్రిల్​ 8న ఏఎస్​ఐకు అనుమతించింది. దీనిపై ఉత్తర్​ప్రదేశ్ సున్నీ వక్ఫ్​ బోర్డ్​ హై కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై పిటిషనర్​, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్న ధర్మాసనం.. సర్వేపై స్టే విధించింది. జస్టిస్​ ప్రకాశ్​ పాడియా నేతృత్వంలోని ధర్మాసం ఈ కేసు తీర్పును రిజర్వ్​ చేసింది.

సుదీర్ఘ వివాదం..

కాశీ విశ్వనాథ్​ ఆలయం, గ్యాన్వాపి మసీదు స్థల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం 2019, డిసెంబర్​లో స్థానిక లాయర్​ వీఎస్​ రాస్తోగి.. వారణాసి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. మొఘల్​ రాజు ఔరంగాజేబ్​ 1664లో 2వేల ఏళ్ల నాటి కాశీ విశ్వనాథ్​ ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించాడని పిటిషనర్​ పేర్కొన్నారు.

భారత సర్వే విభాగం(ఏఎస్​ఐ)తో మసీదు స్థలాన్ని మొత్తం సర్వే చేయాలని న్యాయవాది కోరారు. అయితే.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమ్​ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్​లో భారత సర్వే విభాగానికి అనుమతులు ఇచ్చింది వారణాసి కోర్టు. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండి: ఎన్నికల ముందు కలకలం.. అసెంబ్లీ వెబ్​సైట్​ హ్యాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.