Same Sex Marriage: హిందూ వివాహ చట్టం ప్రకారం తమ పెళ్లిని గుర్తించాలని ఇద్దరు మహిళలు వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు.. స్వలింగ సంపర్క వివాహాలకు వ్యతిరేకమని, చట్టాల ప్రకారం కూడా ఇది చెల్లదని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు.
తన 23 సంవత్సరాల కూతురిని మరో 22 ఏళ్ల యువతి అక్రమంగా నిర్బంధించిందని.. అంజు దేవీ అనే మహిళ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీంతో కోర్టు ఆ ఇద్దరినీ న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 6న ఆదేశించింది. మరుసటి రోజే కోర్టు ముందుకు వచ్చిన ఇరువురు యువతులు 'మేము వివాహం చేసుకున్నాం. దానిని అంగీకరించాలి' అని కోర్టును అభ్యర్థించారు. హిందూ వివాహ చట్టాల స్వలింగ సంపర్కుల వివాహానికి అడ్డుచెప్పవని వారు వాదించారు. అయితే.. 'పవిత్ర భారతదేశంలో వివాహాన్ని సంస్కారంగా భావిస్తారు, అది ఓ పురుషుడు, మహిళ మధ్యే జరగాలి' అన్నారు ప్రభుత్వ న్యాయవాది. దీంతో.. కోర్టు ఆ మహిళల పిటిషన్‌ను తిరస్కరించింది. యువతి తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.
ఇవీ చూడండి: 600 ఏళ్ల నాటి దేవతల విగ్రహాలు స్వాధీనం.. విలువ ఎంతంటే?