ETV Bharat / bharat

విమానంలో ప్రయాణికుడు హల్​చల్.. సీనియర్​ అధికారిపై దాడి.. మెల్లగా మాట్లాడమన్నందుకే! - passenger hit air india officer

Air India Passenger Fight : సిడ్నీ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్​ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. మెల్లగా మాట్లాడన్నమందుకే ఓ సీనియర్ అధికారిపై చేయి చేసుకున్నాడు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులపై దుర్భాషలాడాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. అతడిని దిల్లీలో భద్రతా సిబ్బందికి అప్పజెప్పారు.

Air India Passenger Fight
Air India Passenger Fight
author img

By

Published : Jul 16, 2023, 10:19 AM IST

Air India Passenger Fight : ఎయిర్​ఇండియా విమానాల్లో ఇటీవలే ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా సిడ్నీ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. గట్టిగా అరుస్తూ దుర్భాషలాడాడు. విమాన సిబ్బంది.. ఆ వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పగా.. ఆ తర్వాత అతడు తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇదే జరిగింది..
సిడ్నీ నుంచి దిల్లీ వస్తున్న ఓ విమానంలో ఎయిర్​ఇండియా సీనియర్ అధికారికి, తోటి ప్రయాణికుడికి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సీట్​ విషయంలో ఇబ్బంది తలెత్తడం వల్ల బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీకి క్లాస్​కు వచ్చి ఆ అధికారి కూర్చున్నాడు. తన పక్కనే ఉన్న ఓ వ్యక్తి బిగ్గరగా మాట్లాడుతుండటం వల్ల అతడికి సర్దిచెప్పేందుకు యత్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి.. అధికారిపై చేయి చేసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ పెద్దదైంది. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించగా.. సదరు వ్యక్తి ఆ అధికారితో పాటు సిబ్బందిపైకి విరుచుకుపడ్డాడు. గట్టిగా అరుస్తూ దుర్భాషలాడాడు. దీంతో కాసేపు అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

తోటి ప్రయాణికులు సైతం ఈ ఘటన వల్ల ఇబ్బందికి గురయ్యారు. ఐదుగురు యువ క్యాబిన్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతే కాకుండా అతడికి హెచ్చరించారు. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. దీంతో విమానం దిల్లీకి చేరుకున్నాక.. ఆ వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పారు. ఆ తర్వాత అతడు వారికి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపాడు. ఈ ఘటన జులై 9న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మల, మూత్ర విసర్జన చేసి..
గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎయిర్​ఇండియా విమానాల్లో జరిగాయి. ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్​ఇండియా AIC 866 విమానంలో ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేశాడు. అంతే కాకుండా అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్​ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. ఆ తర్వాత దిల్లీ ఎయిర్​పోర్టు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పోలీస్​ స్టేషన్​కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.