ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 28న (ఆదివారం) అఖిలపక్ష పార్టీల సమావేశం (pm all party meeting) జరగనున్నట్టు సమాచారం. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 11గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం భాజపా పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌లీడర్ల సమావేశం కూడా మధ్యాహ్నం 3గంటలకు జరగనున్నట్టు సమాచారం.ఈ సమావేశాలకు కూడా మోదీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలను (parliament monsoon session 2021) ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలనూ కుదించారు. ఈ దఫా పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్ సహా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇదీ చదవండి:kisan mahapanchayat lucknow: 'మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందే'