ETV Bharat / bharat

భార్యను నాలుగో అంతస్తు నుంచి తోసేసిన భర్త.. అదే కారణమా? - భార్య గొంతు కోసిన భర్త

యూపీలో దారుణం జరిగింది. నలుగురితో కలిసి భార్యను నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకి తోసేశాడు ఓ భర్త. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యూపీలోని బదాయులో కుటుంబ కలహాలతో భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు.

agra woman murder
భార్యను బాల్కనీ నుంచి తొసేసిన భర్త
author img

By

Published : Jun 25, 2022, 6:36 PM IST

భార్యను మరో నలుగురితో కలిసి నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకి తోసేశాడు ఓ భర్త. ఈ ఘటనలో రితికా సింగ్​(30) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుల్లో ముగ్గరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య​ కేసు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో శుక్రవారం ఉదయం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..: ఆకాశ్ గౌతమ్​, రితికా సింగ్​కు 2014లో వివాహం జరిగింది. రితికా సింగ్​.. ఘజియాబాద్​ వాసి కాగా, ఆకాశ్ ఫిరోజాబాద్​కు చెందిన వ్యక్తి. ఇరువురి మధ్య మనస్పర్థల వల్ల 2018నుంచి దూరంగా ఉంటున్నారు. అనంతరం ఫేస్​బుక్​లో పరిచయమైన విపుల్ అగర్వాల్​తో కలిసి తాజ్​గంజ్ పోలీస్​ స్టేషన్ పరిధిలో రితికా సింగ్ నివసిస్తోంది.

రితికా సింగ్ భర్త ఆకాష్ గౌతమ్.. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కలిసి శుక్రవారం రితిక అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అనంతరం రితిక, ఆమె ప్రియుడు విపుల్ అగర్వాల్​తో వాగ్వాదానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత విపుల్ అగర్వాల్ చేతులు కట్టేసి బాత్​రూమ్​లో పడేశారు. అనంతరం రితికను చేతులను కట్టేసి నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. బాత్​రూమ్​ కిటికీ నుంచి విపుల్ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వచ్చి అతడ్ని విడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన అపార్ట్​మెంట్​లోని సీసీటీవీ ఫుటేజ్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కుటుంబ కలహాలతో: కుటుంబ కలహాల వల్ల భార్యను గొంతు కోసి చంపాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయులోని బల్లియా నాగ్లా గ్రామంలో జరిగింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: బుల్లెట్ గాయాలతో ఐఏఎస్ కుమారుడు మృతి.. ఆత్మహత్యా?.. పోలీసుల వల్లేనా?

8వ అంతస్తు పిట్టగోడపై కూర్చొని రోగి హల్​చల్​.. చివరకు కిందపడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.