ETV Bharat / bharat

తల్లి ప్రాణాలను కాపాడబోయి తనయుడు మృతి

సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకు కొద్ది రోజులకే విగతజీవిగా మారాడు. తేనెటీగల బారి నుంచి తన తల్లిని రక్షించబోయి అదే దాడిలో తన ప్రాణాలను కోల్పోయాడు.

bee bitten mother and son saved
bee bitten mother and son saved
author img

By

Published : Nov 5, 2022, 1:53 PM IST

తేనెటీగల బారి నుంచి తన తల్లిని రక్షించిన ఓ కొడుకు.. అదే దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన బంగాల్​​లోని రాయ్దిఘీలో జరిగింది. ఉద్యోగరీత్యా తన భార్యతో నదియాలోని తాహెర్‌పుర్‌లో నివసిస్తున్న సూరాజిత్.. దుర్గాపూజ సెలవుల్లో రాయ్దిఘీ నాగేంద్రపూర్‌లోని తన సొంత ఊరికి కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతని తల్లి యథావిధిగా వంటగదిలో పని చేస్తోంది. గదిలో నుంచి వచ్చే పొగ కారణంగా బయటున్న తేనెటీగలు అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి తన తల్లిపై దాడి చేశాయి.

తల్లి కేకలు విన్న సురాజిత్ హుటాహుటిన​ వంట గదిలోకి వెళ్లి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలోనే తేనెటీగలు అతనిపై కూడా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆ ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: భారత అత్యధిక వయస్కుడైన ఓటర్​ కన్నుమూత.. ఓటు వేసిన కొన్ని రోజులకే

పంచాయితికి పిలిపించి మహిళపై కౌన్సిలర్​ గ్యాంగ్​రేప్​​​.. ఏడో తరగతి విద్యార్థిపై కాల్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.