దిల్లీలో గాలి నాణ్యత (Air quality index delhi) మళ్లీ క్షీణిస్తోంది. దీపావళి వేడుకల అనంతరం.. ఇది మరింత పెరిగింది. జన్పథ్ ప్రాంతంలో ప్రమాదకరస్థాయికి (Pollution index delhi) చేరినట్లు అధికారులు వెల్లడించారు. కాలుష్య మీటర్లో గణాంకాలు దీనికి సంకేతం.
ఆకాశాన్ని దట్టమైన పొగమంచు (Delhi air quality) దుప్పటి కప్పేసింది. వాయు కాలుష్యం కారణంగా.. దేశరాజధానిలో పలు చోట్ల ప్రజలను గొంతు నొప్పి, కళ్ల నుంచి నీరుకారడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
దిల్లీ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించినప్పటికీ.. దీపావళి వేళ పలు ప్రాంతాల్లో ప్రజలు టపాసులు కాలుస్తూ కనిపించారు. ఇదే గాలి నాణ్యత(Air quality index delhi) పతనానికి కారణమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట దగ్ధం ఈ పరిస్థితిని మరింత పెంచింది.
ఆదివారం(నవంబర్ 7) సాయంత్రం వరకు ఈ పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు లేవని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు- అంబరాన్నంటేలా సంబరాలు