ACB Court Rejected PT Warrants Filed by CID Against CBN: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో సీఐడీ అధికారులు ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేశారు. ఆ పీటీ వారెంట్లలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులను విచారించాలని కోర్టును కోరారు. అయితే, వారెంట్లు విచారణ దశలో ఉండగానే చంద్రబాబుకు హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిందని, దీంతో పీటీ వారెంట్లు నిరర్ధకమవుతాయని తెలియజేస్తూ ఏసీబీ కోర్టు వాటిని తోసిపుచ్చింది.
Vijayawada ACB Court Updates: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో ఆయనను (చంద్రబాబు) విచారించేందుకు సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లను మంగళవారం ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సమయంలోనే సీఐడీ అధికారులు ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేశారు. పీటీ వారెంట్లపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు మరోసారి విచారణ జరిపింది. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారని, అందువల్ల పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్ట్ స్పష్టం చేసింది.
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ - ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన
AP CID Filed Two Petitions Against Chandrababu: చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ సెప్టెంబర్ నెలలో ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్‌లు దాఖలు చేసింది. మొదటగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలాలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ రెండవ పిటిషన్ దాఖలు చేసింది. రెండు పీటీ వారెంట్లపై విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
CID Filed Two Petitions Against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో సీఐడీ రెండు పిటిషన్లు
ACB Court Rejected Both Petitions of CID: ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీట్ వారెంట్లపై మంగళవారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బెయిల్‌పై బయట ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసింది. వారెంట్లు విచారణ దశలో ఉండదానే చంద్రబాబుకు హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిందని పేర్కొంది. దీంతో పీటీ వారెంట్లు నిరర్ధకమవుతాయని తెలియజేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.