ETV Bharat / bharat

ACB Court on Chandrababu Security: జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. స్పందించిన ఏసీబీ కోర్టు - have doubts about security

ACB Court on Chandrababu security: తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు అభ్యర్థనపై స్పందించిన న్యాయమూర్తి.. భధ్రతపై అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జైలు అధికారులను ఆదేశించారు.

ACB Court on Chandrababu security
ACB Court on Chandrababu security
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 3:51 PM IST

ACB Court on Chandrababu security: స్కిల్ డెవలప్​మెంట్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ... ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట జైలు అధికారులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆయన తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి భధ్రతపై అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. మెడికల్ రిపోర్టులు కోర్టుకు సమర్పించాలని జైలు అధికారులను ఆదేశించారు.

TDP Leaders Protest In West Godavari : 'పశ్చిమ'లో టీడీపీ నేతల నిరసన... 'గడప గడపకు బాబుతో నేను'

జ్యుడిషియల్‌ రిమాండ్​ 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు: చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్​ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. నవంబర్‌ 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదేవిధంగా చంద్రబాబు తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ వేశారు. సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ములాఖత్‌లు పెంచాలని ఆయన తరఫు లాయర్ల పిటిషన్​లో పేర్కొన్నారు. లీగల్ ములాఖత్ రోజుకు మూడుసార్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టుకు విన్నవించారు. పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ములాఖాత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు తరఫున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Pawan Kalyan met Chandrababu in Rajahmundry Jail: జైల్లో చంద్రబాబుతో పవన్​కల్యాణ్​ ములాఖత్​.. భువనేశ్వరి, బ్రాహ్మణిలకు పరామర్శ

ఇప్పటికే జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్​ ను కలిసిన టీడీపీ నేతలు: ఇప్పటికే చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించడంపై... తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై రాజమహేంద్రవరంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ను సైతం కలిసి ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబుతో రోజుకు మూడు సార్లు లీగల్ ములాఖత్‌కు అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు కేసులపై వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోందని... ఈ కేసుల విచారణ దృష్ట్యా న్యాయవాదులతో చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అభ్యర్థన మేరకూ... అధికారులు స్పందించారు. ములాఖత్​ల నేపథ్యంలో ఇతర ఖైదీలకు ఇబ్బందులు కలుగుతున్నాయని.. అందుకోసమే ములాఖాత్​లను తగ్గిస్తున్నట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ములాఖత్​లను పెంచే విషయంపై సైతం కోర్టులో పిటిషన్ వేశారు.

హైకోర్టులో వాదనలు: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 40 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారన్న.. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారన్న చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Advocate Mulakat Rejected at Rajamahendravaram Central Jail: చంద్రబాబుతో సుంకర కృష్ణమూర్తి ములాఖత్ తిరస్కరణ.. "బార్ కౌన్సిల్​కు ఫిర్యాదు చేస్తాం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.