ETV Bharat / bharat

ఆప్ వర్సెస్ భాజపా, అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా, పోటాపోటీ ఆందోళన - దిల్లీ మద్యం పాలసీ

AAP vs BJP Overnight Protest దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆందోళన నిర్వహించింది. ఆప్​ నిరసనకు కౌంటర్​గా భాజపా ఎమ్మెల్యేలు సైతం అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు.

aap vs bjp overnight protest
ఆప్ వర్సెస్ భాజపా
author img

By

Published : Aug 30, 2022, 11:32 AM IST

AAP vs BJP Overnight Protest: దేశ రాజధాని దిల్లీలో ఆప్‌, భాజపా మధ్య రాజకీయ విభేదాలు మరింత ముదురుతున్నాయి. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాపై ఆప్‌ తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసింది. వీటిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నుంచి అసెంబ్లీలో నిరసనకు దిగారు. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీకి కౌంటర్‌గా భాజపా ఎమ్మెల్యేలు కూడా శాసనసభా ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. దీంతో దిల్లీ అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.

aap vs bjp overnight protest
ఆందోళన చేస్తున్న ఆప్ ఎమ్మెల్యేలు

భాజపా ఆరోపణలను తిప్పికొట్టేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం శాసనసభలో సొంత ప్రభుత్వంపైనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాపై ఆప్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సక్సేనా.. తన ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రూ.1400 కోట్ల విలువైన పాత నోట్లను మార్పిడి చేయించారని ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు రాత్రంతా శాసనసభ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అన్నట్లుగానే నిన్న రాత్రి నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆప్‌ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. ఎల్‌జీ సక్సేనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రి అసెంబ్లీ ప్రాంగణంలోనే ఎమ్మెల్యేలు నిద్రించారు.

aap vs bjp overnight protest
అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న భాజపా ఎమ్మెల్యేలు

అయితే కాసేపటికే భాజపా ఎమ్మెల్యేలు కూడా శాసనసభా ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని మంత్రులు మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్‌ అవినీతికి పాల్పడ్డారని, వారిని వెంటనే మంత్రి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలోని భగత్‌సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌ విగ్రహాల వద్ద ఆందోళన చేశారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిరసనలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి.

సీబీఐని ఆశ్రయించనున్న ఆప్‌..
ఇదిలా ఉండగా.. ఎల్‌జీ సక్సేనాపై విచారణ జరపాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ సీబీఐని ఆశ్రయించనున్నట్లు సమాచారం. మంగళవారం పలువురు ఆప్‌ ఎమ్మెల్యేల బృందం సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఇటీవల దిల్లీ నూతన మద్యం విధానంపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా సీబీఐకి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఇటీవల మంత్రి మనీశ్‌ సిసోదియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది.

ఇవీ చదవండి: పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద, కాపలాగా సర్పాలు, గది నుంచి సొరంగ మార్గం

బలవంతంగా బీఫ్ తినిపించిన భార్య, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.