AAICLAS Security Screener Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు
AAICLAS Security Screener Job Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి 60% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం 55% మార్కులతో పాసైతే సరిపోతుంది.
వయోపరిమితి
AAICLAS Security Screener Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 27లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు 5 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
AAICLAS Security Screener Job Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం
AAICLAS Security Screener Selection Process : అభ్యర్థులతో ముందుగా పర్సనల్ ఇంటిరాక్షన్ ఉంటుంది. తరువాత వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తారు. తరువాత వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
AAICLAS Security Screener Salary :
- సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతంతో పాటు, అలవెన్సులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. జీతం ప్రతి ఏడాదీ పెరుగుతుంటుంది. ఎలా అంటే..
- అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000 చొప్పున ఇస్తారు. రెండో ఏడాది నెలకు రూ.32,000 చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.34,000 చొప్పున ఫిక్స్డ్ సాలరీ ఇస్తారు.
దరఖాస్తు విధానం
AAICLAS Security Screener Application Process :
- అభ్యర్థులు ముందుగా AAICLAS అధికారిక వెబ్సైట్ https://aaiclas.aero/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లోని Careers ట్యాబ్ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ పేరుపై రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత..
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
- ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని, భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
AAICLAS Security Screener Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 17
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 08
డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ACIO పోస్టులు - అప్లై చేసుకోండిలా!
ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?