ETV Bharat / bharat

మతం మారలేదని యువకుడికి చిత్రహింసలు.. పెట్రోల్ పోసుకుని ప్రేయసిని హత్తుకున్న ప్రియుడు - ఇద్దరిని హత్య చేసిన మాంత్రికుడు

మతం మారేందుకు నిరాకరించిన ఓ యువకుడిపై దాడి చేశారు ప్రియురాలి కుటుంబ సభ్యులు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఓ యువకుడు. అనంతరం తాను ప్రేమిస్తున్న యువతిని హత్తుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు.

lover beaten by family members
మతం మారలేదని యువకుడికి దాడి
author img

By

Published : Nov 22, 2022, 1:31 PM IST

మతం మారేందుకు నిరాకరించిన ఓ యువకుడిని తీవ్రంగా హింసించారు ప్రియురాలి కుటుంబ సభ్యులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో వెలుగుచూసింది. రెండు రోజులపాటు యువకుడిని బంధించి అతడిపై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ జరిగింది..
దీపక్ సోన్వానే అనే యువకుడు.. 2018లో ఔరంగాబాద్​లో బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదివేవాడు. అప్పుడే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. క్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు. యువకుడు తమ మతంలోకి మారితేనే పెళ్లి చేస్తామని షరతు పెట్టారు యువతి కుటుంబ సభ్యులు. అందుకు దీపక్ నిరాకరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు.. దీపక్​ను చిత్రహింసలకు గురిచేశారు.

రెండు రోజుల పాటు దీపక్​ను ఇంట్లో నిర్బంధించి తీవ్రంగా దాడి చేశారు. అతడి కుటుంబ సభ్యులను సైతం వేధించారు. యువకుడిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. అక్కడితో ఆగకుండా దీపక్ కుటుంబం నుంచి.. రూ.11 లక్షలు తీసుకున్నారు. దీంతో దీపక్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ కార్యాలయంలో ఆయన అనుచరులు తనను తీవ్రంగా కొట్టారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ప్రియురాలి తండ్రి తీవ్రంగా కొట్టాడని తెలిపాడు.

పెట్రోల్ పోసి నిప్పంటించుకుని..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ చేస్తున్న గజానన్‌ ముండే అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటల్లో కాలుతూనే.. తాను ప్రేమిస్తున్న యువతిని కూడా గట్టిగా హత్తుకోవడం వల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అదే వర్శిటీలో పీహెచ్​డీ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం యువకుడు తనను వేధిస్తున్నట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి తనను అన్ని విధాలా వాడుకుందని.. యువకుడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో యువతి ఫోరెన్సిక్‌ ప్రాజెక్టు చేస్తుండగా అక్కడికి వెళ్లిన గజానన్‌.. కేబిన్‌ తలుపులు మూసివేశాడు. తనతో పాటు రెండు పెట్రోల్ బాటిళ్లు తీసుకెళ్లిన అతడు ఒకటి తనపై పోసుకుని.. మరొకటి యువతిపై పోశాడు. మంటలు అంటించుకుని వెళ్లి యువతిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటనలో అతడికి 85శాతం, యువతికి 50శాతం కాలిన గాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యం ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫెవికాల్ పోసి.. పదునైన కత్తితో..
రాజస్థాన్ ఉదయ్​పుర్​లో దారుణం జరిగింది. ఓ మహిళ, యువకుడి మృతదేహాలు నగ్నంగా కనిపించడం కలకలం రేపింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వీరిద్దరినీ మాంత్రికుడు భోలేశ్ జోషి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతులిద్దరికీ విడివిడిగా వివాహాలు అయ్యాయి. అయితే మాంత్రికుడు జోషి దగ్గరకు వచ్చేటప్పుడు వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. ఈ విషయం మాంత్రికుడికి తెలిసింది. మృతుడి భార్యకు ఈ సంగతి చెబుతానని బెదిరించాడు. అయితే ఈ క్రమంలో మాంత్రికుడి వద్ద శక్తులు లేవని భక్తులకు చెబుతామని వారిద్దరూ అన్నారు. తన పరువు తీస్తారని భయపడిన మాంత్రికుడు భోలేశ్​.. ఇద్దరిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. క్షుద్రపూజల నిమిత్తం నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి.. ఇద్దరిపై ఫెవికాల్ పోసి పదునైన కత్తితో ఇద్దరిని నరికి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

murder case
నిందితుడు భోలేశ్ జోషిని అరెస్ట్ చేసిన పోలీసులు

యువకుడిపై రాడ్లు, కర్రలతో..
రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​లో దారుణం జరిగింది. వివాహితతో లివ్​ ఇన్ రిలేషన్​షిప్​లో ఉన్న ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. నిందితుడు వివాహిత భర్తేనని పోలీసులు తెలిపారు. నిందితుడు తన అనుచరులతో కలిసి కర్రలు, ఇనుప రాడ్​లతో యువకుడిపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని గుర్మైల్​ సింగ్​గా పోలీసులు గుర్తించారు. అతడు గత నాలుగు నెలలుగా ప్రవీణ్ కౌర్ అనే మహిళతో లివ్​ ఇన్ రిలేషన్​షిప్​లో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.