coimbatore acid attack:గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడిందో మహిళ. ఆపై తానూ భయంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వెలుగుచూసిందీ ఉదంతం.
తనతో ఉండనన్నాడని..
living relationship in coimbatore: కోయంబత్తూరుకు చెందిన జయంతి(27), రాకేశ్(30) గత కొన్ని నెలలుగా ఓ అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నారు. కేరళకు చెందిన రాకేశ్ ఓ పని నిమిత్తం ఇటీవలే తన స్వగ్రామానికి వెళ్లివచ్చాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి జయంతితో సంబంధం తెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అందులో భాగంగా.. 'తాను కేరళలో ఓ మహిళను వివాహం చేసుకున్నానని.. అందువల్ల తనతో సహజీవనం చేయలేనని జయంతికి అబద్ధం చెప్పాడు. దీనితో కోపోద్రిక్తురాలైన జయంతి.. రాజేశ్‌పై యాసిడ్ దాడికి పాల్పడింది. ఆనంతరం ఆమె కూడా నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
![acid attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-cbe-02-lovers-issue-script-7208104_04122021132950_0412f_1638604790_471_0412newsroom_1638623961_609.jpg)
దీనిపై సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. జయంతిపై 323, 324, 326(ఏ) సెక్షన్ల కింద, రాజేశ్‌పై 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: