ETV Bharat / bharat

ప్రాణం తీసిన ఫ్రీఫైర్​.. బాలుడ్ని రాయితో కొట్టి చంపిన స్నేహితులు - మైనర్​ మర్డర్​ న్యూస్​

Free Fire Game Murder In Koraput: ఫ్రీఫైర్​ ఆటలో తలెత్తిన గొడవ కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడి స్నేహితులిద్దరే బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కొరాపుట్​లో జరిగింది.

koraput murder case
author img

By

Published : Apr 16, 2022, 8:11 AM IST

Updated : Apr 16, 2022, 9:13 AM IST

Free Fire Game Murder In Koraput: ఒడిశా కొరాపుట్​ జిల్లాలో దారుణం జరిగింది. ఫ్రీఫైర్​ ఆటలో తలెత్తిన గొడవ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. మసిపుట్​ గ్రామానికి చెందిన లులు భోయ్​ను అతడి ఇద్దరు స్నేహితులు హత్యచేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది: మసిపుట్​కు చెందిన లులు భోయ్​ ఏడో తరగతి చదువుతున్నాడు. లులుతో పాటు అతడి ఇద్దరు స్నేహితులు స్థానిక పాఠశాల సమీపంలో ఫ్రీఫైర్​ ఆడుతున్నారు. అయితే, గేమ్​ ఓడిపోయిన లులు.. మరోసారి ఆడేలా మొబైల్​ను ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు కలిసి లులు తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని కోలాబ్​ నది దగ్గర పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రేప్​ కేసు వాపస్​ తీసుకోవాలని బెదిరింపులు.. నిప్పంటించుకున్న బాలిక

Last Updated : Apr 16, 2022, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.