ఓ పక్షి 185 మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. అప్పుడే టేకాఫ్ అయిన స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగేలా చేసింది. విమానం ఎడమవైపు ఉన్న ఓ ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి మంటలు రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని తిరిగి పట్నా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. సిబ్బంది.. ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం వీరిని మరో విమానంలో దిల్లీకి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన స్పైస్‌జెట్ ప్రతినిధులు.. పక్షి ఢీకొనడం వల్ల విమానం ఎడమవైపు ఉన్న ఆ ఇంజిన్ భాగం బాగా దెబ్బతిందని, మూడు బ్లేడ్లు ధ్వంసమైనట్లు తమ ప్రాధమిక పరిశీలనలో తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : అగ్నిపథ్ రిక్రూట్మెంట్.. వాయుసేన కీలక ప్రకటన!