Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మరో 975 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,40,947కు చేరింది. వైరస్ ధాటికి నలుగురు చనిపోయారు. 796 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 11,366గా ఉన్నాయి.
- యాక్టివ్ కేసులు: 11,366
- మరణాలు: 5,21,747
- మొత్తం కేసులు: 4,30,40,947
- రికవరీలు: 4,25,07,834
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 6,89,724 మందికి శుక్రవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,38,31,723కు చేరింది. కొత్తగా 3,00,918 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,60,57,533 కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 6,99,300 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,270 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- దక్షిణ కొరియాలో తాజాగా 125,808 కరోనా కేసులు నమోదయ్యాయి. 264 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 88,188 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 91 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 125,394 మంది వైరస్ సోకింది. మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 45,999 కరోనా కేసులు బయటపడ్డాయి. 34 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 61,555 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: 'అలా జీవచ్ఛవంలా బతికే బదులు చావడం మేలు కదా!'
ప్రాణం తీసిన ఫ్రీఫైర్.. బాలుడ్ని రాయితో కొట్టి చంపిన స్నేహితులు