ETV Bharat / bharat

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య! - దిల్లీలో అత్యాచారం

దిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. ఆ ప్రాంతంలోని కాటికాపరే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

rape and murder
అత్యాచారం
author img

By

Published : Aug 2, 2021, 10:47 AM IST

Updated : Aug 2, 2021, 11:29 AM IST

దిల్లీలోని కంటోన్మెంట్​ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికను హత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. ఆ ప్రాంతానికి సమీపంలోని కాటికాపరే ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ జరిగింది

బాధితురాలు.. ఆదివారం సాయంత్రం నీళ్ల కోసం బయటకు వెళ్లింది. చాలా సమయం వరకు.. ఇంటికి రాలేదు. అయితే సాయంత్రం 6 గంటలకు సమీపంలోని కాటికాపరి.. బాధితురాలి తల్లిని శ్మశానవాటికకు పిలిచి.. బాలిక మృతిదేహాన్ని చూపించాడు. నీళ్లు పడుతుండగా విద్యుదాఘాతానికి గురై.. చనిపోయినట్లు చెప్పాడు. అనంతరం కుటుంబ సభ్యులను తికమకపెట్టి.. ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లవద్దని.. తీసుకెళ్తే పోలీసుల వచ్చి.. పోస్టుమార్టం చేసి అవయవాలు తీసేస్తారని చెప్పాడు. వెంటనే అంతిమ సంస్కారాలు చేయాలని ఒత్తిడి చేశాడు. అయితే ఇందుకు అంగీకరించని కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు.

తమ అనుమతి లేకుండా మృతదేహానికి దహనం చేసేందుకు ప్రయత్నించాడని.. ఆ కుటుంబం ఆరోపించింది. తమ కుమార్తె శరీరంపై కాలిన గుర్తులు ఉన్నాయని తెలిపింది. అవి విద్యుదాఘాతం వల్ల ఏర్పడినవి కావని పేర్కొంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విషయాన్ని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్​ బృందాన్ని పిలిపించారు. ఫోరెన్సిక్​ బృందం.. నిదింతుడిని పరిశీలించిగా.. పెదవులు నీలి రంగులోకి మారాయి. అలాగే అతని మణికట్టు మీద కాలిన గుర్తులు ఉన్నాయి.

దీంతో ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: జడ్జి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

Last Updated : Aug 2, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.