ETV Bharat / bharat

విదేశీ సెక్స్​ రాకెట్​ గుట్టురట్టు.. బార్​లోని సీక్రెట్​ రూంలో 21 మంది యువతులు - బార్​లో పట్టుబడ్డ యువతులు

కర్ణాటకలో ఓ విదేశీ సెక్స్​ రాకెట్​ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళలతో పాటుగా ఆరుగురు పురుషులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని ఓ బార్​ని దాడులు నిర్వహించిన పోలీసులు.. రహస్య నిర్మాణంలో దాచి ఉంచిన కొందరు మహిళను గుర్తించారు.

arrested for running a prostitution racket in Bangalore
విదేశీ సెక్స్ రాకెట్​
author img

By

Published : Dec 18, 2022, 2:20 PM IST

కర్ణాటక బెంగళూరులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న 8 మంది విదేశీయులను అరెస్ట్​ చేశారు పోలీసులు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కెంగేరి, సోలదేవనహళ్లి ప్రాంతాల్లో విదేశీ మహిళలు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతాల్లో స్పెషల్​ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు దాడులు నిర్వహించారు.

నిందితుల వద్ద నుంచి బంగాల్​, త్రిపురకు చెందినట్లు ఆధార్​ కార్టులతో పాటు.. బంగ్లాదేశ్​కు చెందిన కొవిడ్ వ్యాక్సినేషన్​ సర్టిఫికేట్​లు లభ్యమయ్యాయి. వీరు అక్రమంగా భారత్​లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను ప్రాథమికంగా విచారించగా వారంతా భారతీయులమేనని వెల్లడించినట్లు క్రైమ్​ బ్రాంచ్​ కమిషనర్​ ఎస్​డీ శరణప్ప తెలిపారు.

బార్​లో దాడులు.. పట్టుబడిన 21మంది మహిళలు..
మహారాష్ట్ర ముంబయిలోని ఓ బార్​పై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ దాడిలో 21 మంది మహిళలను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 17 మంది రహస్య నిర్మాణంలో ఉండగా.. నలుగురు బార్​లో డ్యాన్స్​లు చేస్తున్నారని తెలిపారు. వీరితో పాటు బార్​ మేనేజర్​, ఆరుగురు సిబ్బందితో పాటు 19 మంది కస్టమర్స్​ను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.