ETV Bharat / bharat

కశ్మీర్​ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర.. 73ఏళ్ల వ్యక్తి ప్రయాణం.. వెయ్యి కి.మీ పూర్తి - kiran seth cycle tour

పర్యావరణ రక్షణపై అవగాహన కల్పించడానికి ఏడుపదుల వయసులో యువతకు సైకిల్​ యాత్ర చేపట్టారు డాక్టర్ కిరణ్​ సేథ్. దాదాపు 2500 కిలోమీటర్లు ప్రయాణం చేయనున్న ఆయన సెప్టంబర్​21న రిషికేశ్​ చేరుకున్నారు.

75-year-old-kiran-seth-set-out-on-a-journey-from-kashmir-to-kanyakumari

author img

By

Published : Sep 24, 2022, 8:58 AM IST

Speak Mackay Founder Kiran Seth : కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ యాత్ర చేపట్టిన స్పీక్‌ మాకే సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కిరణ్‌ సేథ్‌ మరో ఇద్దరు సభ్యులతో కలిసి గురువారం రిషికేశ్‌ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజలు సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి తన సైకిల్‌యాత్ర దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఆయన 1,000 కి.మీ. ప్రయాణించారు. కిరణ్‌.. ఖరగ్‌పుర్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆయన దేశీయ కళలు సంస్కృతికి ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తుంటారు.

పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన ...
పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన కల్పించడానికి సైకిల్​ యాత్ర చేపట్టారు 73 ఏళ్ల డాక్టర్​ కిరణ్​ సేథ్​. ఈ వయసులో 1500 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ యాత్రలో దాదాపు 2500 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు. యువతకు పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే సైకిల్​ యాత్రను చేస్తున్నట్లు డాక్టర్ కిరణ్​ సేథ్​ తెలిపారు. సైకిల్​తో కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు.

అంతకుముందు డిసెంబరులో కిరణ్​ సేథ్​.. పుదుచ్చేరి నుంచి చెన్నైకి సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతరం, ఈ ఏడాది మార్చిలో మరో యాత్ర చేశారు. మార్చి 11న దిల్లీలోని రాజ్​ఘాట్​లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి.. తన సైకిల్ యాత్రను ప్రారంభించారు కిరణ్​ సేథ్​. అల్వార్​, జైపుర్​, అహ్మదాబాద్​, బరోడా, గోద్రా మీదుగా ప్రయాణించి ఉజ్జయిని చేరుకున్నారు. జీవితాన్ని గడపడానికి సుఖవంతమైన జీవనం అవసరం లేదని.. సాధారణంగా జీవించడంలోనే జీవిత రహస్యం దాగి ఉందన్నారు.

ఇదీ చదవండి: 'వారిని కూడా కలవండి మోదీజీ!'.. వెంకయ్య సలహా

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గహ్లోత్.. 'ఆయన రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.