చిన్న పిల్లలు తమకు నచ్చినదాని కోసం తల్లిదండ్రులపై అలగటం సాధారణంగా చూస్తుంటాం. అయితే కర్ణాటకకు చెందిన ఓ ఐదేళ్ల బాలుడు తనకు ఎంతో ఇష్టమైన చిలుక కోసం ఏకంగా పాముతోనే పోట్లాడాడు.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఓ కుటుంబం నివాసముంటోంది. మూడు రోజుల క్రితం ఎప్పటిలానే కుటుంబ సభ్యులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అదే ఇంట్లో ఉంటున్న 5 ఏళ్ల బుడతడు కార్తిక్ ఇంటి దగ్గరే ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో తమ కుటుంబం ఇష్టంగా పెంచుకుంటున్న చిలుక పంజరంలోకి ఓ పాము ప్రవేశించడం గమనించాడు కార్తిక్. ఆ పాము చిలుకను గాయపరుస్తుందన్న భయంతో కేకలు వేసినా ఎవరూ స్పందించలేదు. దీనితో తనకు ఎంతో ఇష్టమైన చిలుకను కాపాడుకునేందుకు ఏ మాత్రం భయం లేకుండా పామును చేతితో పట్టి లాగేశాడు ఆ బుడతడు. ఎట్టకేలకు స్వల్ప గాయాలతో చిలుకను రక్షించుకోగలిగాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలైన ఆ సర్పం మాత్రం ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ చూడండి:11 ఏళ్ల బాలుడ్ని బలిగొన్న మూఢనమ్మకం!