ETV Bharat / bharat

'యూపీలో ఐదు వేల మదర్సాలు మూసివేత!'

ఉత్తర్​ప్రదేశ్​లో సుమారు 5వేల మదర్సాలను మూసివేయనుంది(madrasa closed) యోగి ఆదిత్యనాథ్ సర్కారు(UP Government). ఈ నిర్ణయంతో రాష్ట్రానికి రూ.100కోట్ల నిధులు మిగులుతాయని సమాచారం.

Yogi Adityanath
యోగి ఆదిత్యనాథ్
author img

By

Published : Aug 27, 2021, 3:21 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దాదాపు 5వేల మదర్సాలను మూసివేస్తున్నట్లు(madrasa closed) రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యుడు సురేశ్ జైన్ వెల్లడించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా రూ.100కోట్ల ఆదాయం మిగులుతుందని చెప్పారు.

మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సురేశ్ జైన్ అన్నారు. 'సబ్​కా సాత్ సబ్​కా వికాస్​' నినాదంతో యోగి సర్కారు(Yogi Adityanath) పనిచేస్తోందని చెప్పారు.

మదర్సాల మూసివేత నిర్ణయాన్ని వెల్లడిస్తున్న సురేశ్ జైన్

మదర్సాల కోసం ఇదివరకే ఓ వెబ్​సైట్​​ ప్రారంభించింది యోగి ఆదిత్యనాథ్ సర్కారు(UP Government). ఈ సంస్థలన్నింటినీ ఆ పోర్టల్​లో నమోదు చేసుకోవాలని ఆదేశించింది. మదర్సాల్లో జరిగే కార్యకలాపాల వివరాలన్నీ అందులో ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ ఉంటుంది. రాష్ట్రంలో అనేక వక్ఫ్​ బోర్డులలో అక్రమాలు జరిగాయని కేసులు నమోదైన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: యూపీ సీఎంకు ఖలిస్థానీ సంస్థ బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.