ఐదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారిని ఒంటరి ప్రదేశానికి రప్పించిన బాలుడు.. ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు గుర్తించారు. బృందావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ ఘటనలో నిందితుడైన 16 ఏళ్ల బాలుడిని పిల్లల సంరక్షణ గృహానికి తరలించారు.
అత్యాచారం గురించి ఎవరికీ చెప్పొద్దని నిందితుడు చిన్నారిని బెదిరించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. బాలుడిపై ఐపీసీతో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
'ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని దర్యాప్తు కొనసాగుతోందని' సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు.
40ఏళ్ల మహిళపై..
యూపీలోని భదోహిలో 40 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. సూర్యవాన్ అనే ప్రాంతంలోని ఓ గ్రామంలో సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో భగవాన్ దాస్ బింద్ (50) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సూర్యవాన్ ఎస్‌హెచ్‌ఓ భువనేశ్వర్ పాండే తెలిపారు.
ఘటన జరగ్గానే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పటికీ.. స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి నిరాకరించారని బాధితురాలి కుటుంబం వాపోయింది. దీనిపై కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం ఆదేశాలతో బింద్‌ను అరెస్టు చేసి కస్టడీకి పంపారు పోలీసులు.
ఇవీ చదవండి: