మినీ సార్వత్రికంలో విజేతలను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారం భాజపాదేనని తేల్చాయి. మునుపటితో పోల్చితే సీట్లు తగ్గినప్పటికీ ఆ రాష్ట్రంలో కమలదళానికి మెజారిటీకి మించి సీట్లు వస్తాయని తెలిపాయి.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కనుందని పోల్స్ పేర్కొన్నాయి. మణిపుర్లో భాజపా అధికారం దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఉత్తరాఖండ్‌లో హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు, గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పోల్స్ అంచనా వేశాయి.
ఉత్తర్‌ప్రదేశ్- విజేత
భాజపామ్యాట్రైజ్ పోల్ ప్రకారం యూపీలో భాజపాకు 262 నుంచి 277 సీట్లు రానున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి 119 నుంచి 134 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఎస్పీకి 7-15, కాంగ్రెస్‌కు 3-8 వరకు రానున్నట్లు పోల్స్‌లో వెల్లడైంది.
పీ-మార్క్ ప్రకారం యూపీలో భాజపాకు 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్‌కు 4 స్థానాలు రానున్నాయి. ఇతరులు రెండు చోట్ల గెలుస్తారని పీ-మార్క్ పోల్ అంచనా వేసింది.
పంజాబ్- విజేత ఆమ్ ఆద్మీ
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ప్రభంజనం సృష్టించనుందని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్.. కేజ్రీవాల్ పార్టీకే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో మెజారిటీకి 59 స్థానాలు అవసరం కాగా.. ఆప్ అంతకుముంచి సీట్లను గెలుచుకోనుందని పోల్స్ పేర్కొన్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండో స్థానంలో ఉంది. భాజపాకు కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ!
మరోవైపు, ఉత్తరాఖండ్‌లో భాజపా-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఏబీపీ-సీఓటర్ అంచనాల ప్రకారం భాజపాకు 26-32 స్థానాలు రానుండగా.. కాంగ్రెస్‌కు 32 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మెజారిటీకి 36 స్థానాలు అవసరం.టైమ్స్ నౌ- వీటో అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్‌లో భాజపాకు 37 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకోనుంది.
గోవాలో హంగ్..
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గోవాలో హంగ్ ఏర్పడనుంది. ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది.
మణిపుర్లో ఆధిక్యంలో భాజపా
మణిపుర్లో భాజపా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌తో పోలిస్తే అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.