ETV Bharat / bharat

Modi SCO Summit: 'తీవ్రవాదం పెను సవాల్- ఉమ్మడి పోరు తక్షణావసరం' - మోదీ స్పీచ్​

ఎస్​సీఓ 20వ వార్షిక సదస్సులో(Modi SCO Summit) వర్చువల్​గా ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వసనీయత లోపించడం వంటి అంశాలు అతిపెద్ద సవాళ్లని అభిప్రాయపడ్డారు. అతివాదం, తీవ్రవాదం పెరగడమే ఈ సమస్యలకు మూల కారణమన్నారు. అఫ్గాన్​లో ఇటీవలి పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయని మోదీ(Modi SCO Speech) పేర్కొన్నారు.

20th anniversary of SCO is right time to think about future of SCO says modi
'రాడికలైజేషనే అతి పెద్ద సవాల్​'
author img

By

Published : Sep 17, 2021, 12:40 PM IST

Updated : Sep 17, 2021, 1:12 PM IST

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ) 20 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ(Modi SCO Summit) కీలక ప్రసంగం చేశారు. ఎస్​సీఓలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్​కు కూడా స్వాగతం పలికారు.

ఎస్​సీఓ(sco summit 2021) భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు ఇదే సరైన సమయమని మోదీ అభిప్రాయపడ్డారు(Modi SCO Speech). ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వసనీయత లోపించడం వంటి అంశాలు అతిపెద్ద సవాళ్లని తెలిపారు. అతివాదం, తీవ్రవాదం(Radicalisation) పెరగడమే ఈ సమస్యలకు మూల కారణమన్నారు. అఫ్గాన్​లో ఇటీవలి పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం, అతివాదం, తీవ్రవాదంపై పోరుకు ఎస్​సీఓ సభ్య దేశాలు(sco members) ఓ పటిష్ఠ ప్రణాళిక రూపొందించి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్య ఆసియా దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

'మన ప్రతిభావంతులైన యువతను శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచనల వైపు ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో భారత దేశాన్ని వాటాదారుగా చేసే దిశగా వినూత్న స్ఫూర్తిని అందించడానికి మేము మా అంకుర సంస్థలు, వాటి వ్యవస్థాపకులను ఒకచోట చేర్చుతాం. అతివాదం, తీవ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఎస్​సీఓ శాంతి, భద్రతల కోసమే కాదు.. మన బంగారు భవిష్యత్తుకూ కీలకం. మితవాదం, సహనంతో కూడిన సమ్మిళిత సంస్థలు, ఇస్లాంకు సంబంధించిన సంప్రదాయాలతో బలమైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఎస్​సీఓ కృషి చేయాలి. రెండు దేశాల మధ్య అనుసంధాన ప్రాజెక్టులు ఏకపక్షంగా కాకుండా సంప్రదింపులు, పారదర్శకతతో ఉండాలి.'

-ప్రధాని మోదీ.

తజికిస్థాన్‌ రాజధాని దుశాన్బె వేదికగా(sco summit 2021 venue) ఎస్​సీఓ సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ దేశ​ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్ దీనికి​ అధ్యక్షత వహిస్తున్నారు. భారత్​ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. మొదటిసారిగా హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఈ సదస్సు​ జరుగుతోంది. పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్​ నాలుగోసారి పాల్గొంది.

గత రెండేళ్లుగా ఈ ఎస్​సీఓలో వివిధ దేశాధినేతలు భవిష్యత్​ ప్రణాళికలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి సమావేశానికి(sco Meeting 2021) ఎస్​సీఓ సభ్యదేశాలు, తాత్కాలిక సభ్యదేశాలు, సెక్రెటరీ జనరల్​, ఎస్​సీఓలోని రీజినల్​ యాంటీ టెర్రరిస్ట్​ స్ట్రక్చర్​(ఆర్​ఏటీఎస్​)​ హాజరయ్యాయి.

ఇదీ చదవండి: S. Jaishankar: 'ఇతర దేశాల అంతర్గత విషయాల్లో భారత్‌ తలదూర్చదు'

Last Updated : Sep 17, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.