ETV Bharat / bharat

21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం - బాలుడి అత్యాచార యత్నం

పట్టపగలే ఓ 21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన యువతి ముఖంపై రాయితో కొట్టి గాయపరిచాడు. కేరళలో ఈ ఘటన జరిగింది.

15 year old boy rape attempt
యువతిపై బాలుడు అత్యాచారయత్నం
author img

By

Published : Oct 26, 2021, 3:15 PM IST

కేరళ మలప్పురం జిల్లాలో(Kerala Malappuram) దారుణ ఘటన వెలుగు చూసింది. 21 ఏళ్ల యువతిపై ఓ 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అంతేగాక.. సదరు యువతి ముఖంపై రాయితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు.

అసలేం జరిగింది?

మలప్పురం జిల్లా(Kerala Malappuram) కొండొట్టీలో సోమవారం మధ్యాహ్నం.. ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే.. ఆమెను అనుసరించిన ఓ బాలుడు.. ఆకస్మాత్తుగా రోడ్డు పక్కకు బలవంతంగా లాగాడు. ఆపై అత్యాచారానికి యత్నించాడు. సదరు యువతి ఏడుస్తూ, అతడిని ప్రతిఘటించింది. దాంతో బాలుడు ఓ రాయి తీసుకుని ఆమె ముఖంపై దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె.. సమీపంలోని ఓ ఇంటికి సాయం కోసం పరిగెత్తింది. స్థానికులు బయటకు వచ్చి నిందితుడి కోసం వెతికారు. కానీ, అప్పటికే.. అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో అతడి చెప్పును స్వాధీనం చేసుకున్నారు. మొదటి దశ దర్యాప్తులో నేరాన్ని బాలుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. బాధిత యువతి, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం

ఇదీ చూడండి: చికిత్స పేరుతో దివ్యాంగురాలిపై డాక్టర్​ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.