అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 14 మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంటుందని దేశ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అసోం పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
అరెస్టు చేసిన వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: Taliban news: రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పంటించిన తాలిబన్లు!