YSRCP Leaders Bail Petition on High Court: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆగస్టు 2కు వాయిదా వేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నేతలు దేవినేని అవినాష్, నందిగామ సురేష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అదే విధంగా టీడీపీ కార్యాలయ దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు సజ్జల, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై కూడా న్యాయస్థానం విచారణ జరిపింది. దాడి కేసులో ఇప్పటివరకు వీరిద్దరినీ నిందితులుగా చేర్చలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నిందితులుగా చేర్చితే ఐదు రోజుల ముందే సమాచారం ఇస్తామని ప్రభుత్వం న్యాయస్థానంకు వివరించింది. వీరిద్దరి పిటిషన్లను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - వైఎస్సార్సీపీ నేతల బెయిల్ పిటిషన్ వాయిదా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 5:56 PM IST