Young Man Commits Suicide Under Train : నిశ్చితార్థం అయినప్పటికీ వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో జరిగింది. ఘట్కేసర్ ఎల్.ఎన్.నగర్‌కు చెందిన వెంకట స్వామి రెండో కుమారుడు కేవీ నర్సింహ మూర్తి (38) ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. అతడికి 10 రోజుల క్రితం నిశ్చితార్థం అయినట్లు పోలీసులకు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 29న ఇంటి వద్ద మొబైల్, బైక్‌ను ఉంచి బయటకు వెళ్లిన అతడు, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమారుడు రాత్రి 9 గంటల వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. రాత్రి 8.30 సమయంలో ఘట్కేసర్-చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. ఆలోపు లోకోపైలట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి జీఆర్పీ పోలీసులు చేరుకుని మృతుడి కుటుంబసభ్యుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు.