Rape On PWD Women: ఓ మానసిక దివ్యాంగురాలిపై ఓ యువకుడు(17) పలుమార్లు అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చిన ఉదంతం నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. యువకుడు దివ్యాంగురాలిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమోనని భయపడి, తన తండ్రి సహాయంతో దివ్యంగురాలికి గత నెల 26న గర్భవిచ్చితి మాత్రలు వేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో యువతి పడిపోగా, సాయంత్రం పని నుంచి వచ్చిన యువతీ తల్లి వెంటనే మిర్యాలగూడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం ఆమె తల్లి ఆగస్టు 30న యువకుడ్ని అతని తండ్రిని న్యాయం కోసం నిలదీయడానికి వెళ్లగా వారు చంపేస్తామని బెదిరించడంతో సెప్టెంబరు 20న పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శుక్రవారం పలు సంఘాలను ఆశ్రయించగా విషయం బయటకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.