ETV Bharat / snippets

'అమ్మా నన్నొదిలి వెళ్లిపోయావా?' - తల్లి మరణం తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

Young Girl Commits Suicide After Mother Death
Young Girl Commits Suicide After Mother Death (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 2:33 PM IST

Young Girl Commits Suicide After Mother Death : తల్లి మరణం తట్టుకోలేక మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో జరిగింది. టేక్మాల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరి చిన్న కుమార్తె ఎనిమిదో తరగతి చదివి ఇంటివద్దే ఉంటోంది. తొమ్మిది నెలల క్రితం ఆమె తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ చిన్న కూతురు తరచూ బాధపడుతుండేది.

బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతసేపటికి తరువాత ఇంట్లోకి వచ్చిన కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం మెదక్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.