ETV Bharat / snippets

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో నీటి పరీక్షలు

ANNARAM BARRAGE WATER TEST
Annaram Barrage Test (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 10:37 AM IST

Annaram Barrage Test : కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో మళ్లీ నీటి పరీక్షల నిర్వహణ చేపడుతున్నారు. ఎన్డీఎస్‌ఏ సూచించిన సిఫార్సుల మేరకు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజీలో పలు పరీక్షలను నిర్వహించారు. మరికొన్ని పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో పూణేకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు అన్నారం బ్యారేజీ వద్దకు ఆదివారం చేరుకున్నారు. ఏడీసీపీ ఆధునిక పద్ధతిలో పరీక్షలను ప్రారంభించారు.

ఇద్దరు శాస్త్రవేత్తలు బోటులో ప్రయాణిస్తూ ఆధునిక పరికరాలతో బ్యారేజీలో పరిశీలన, పరీక్షలు చేశారు. నీటి సామర్థ్యము, నీటి ప్రవాహం ఎంతమేర విడుదల జరుగుతుందో, ఎంత మేర ప్రవాహం వస్తుందో పలు పరీక్షలను నీటి లెవెల్‌ను అనుసరించి పలు దఫాలుగా పరీక్షలు చేయనున్నారు. మొదటి దఫాలో మూడు రోజులపాటు పరీక్షలు చేపట్టి సంబంధిత నివేదికను శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అందించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.