Brothers died in Kamareddy : తమ్ముడి మృతి చెందిన బాధను తట్టుకోలేక అన్న గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం, తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(46) మస్కట్ దేశంలో 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చి, అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై అన్న పెద్ద నర్సింలు బోరున ఏడుస్తూ, ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇద్దరీ మృతదేహాలను ఒకే చితిపై పెట్టి బంధువులు దహన సంస్కారాలు నిర్వహించారు. అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చావులోనూ తమ్ముడుకి తోడుగా అన్న - ఒకే చితిపై ఇద్దరకీ దహన సంస్కారాలు
Published : Jun 3, 2024, 5:49 PM IST