TTD Additional EO Dharma Reddy on Leave : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ధర్మారెడ్డికి ఏడు రోజుల సాధారణ సెలవును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 11 నుంచి 17 (జూన్ 11 - 17) వరకూ వ్యక్తిగత కారణాల రీత్యా సెలవు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ధర్మారెడ్డి విధులు నిర్వహించే చోటు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినా రాష్ట్రం దాటి వెళ్లొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో వైపు ఈ నెలాఖరున ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే సెలవు నుంచి తిరిగి వచ్చిన ధర్మారెడ్డి తిరిగి విధుల్లో చేరే అంశంపై సందేహాలు నెలకొన్నాయి.