ETV Bharat / snippets

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం - విషయం తెలిస్తే షాక్​ తప్పదు?

author img

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Three People Suicide Attempt in Hotel at Nagole
Three People Suicide Attempt in Hotel at Nagole (ETV Bharat)

Three People Suicide Attempt in Hotel at Nagole : నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ హోటల్​లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన సికింద్రాబాద్​ మహంకాళి పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే, నాగోల్​కు చెందిన ఓ కుటుంబం ఐదు రోజులుగా తాజ్​ త్రీ స్టార్​ హోటల్​లో ఉంటున్నారు.

అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని కోడలు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆ భయంతో ఆ కుటుంబ సభ్యులు హానికర పదార్థం తీసుకొని హోటల్​లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారు ఉదయం లేచే సరికి అపస్మారక స్థితిలో ఉన్నట్లు హోటల్​ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.