ETV Bharat / snippets

బాణామతి చేస్తున్నారన్న అనుమానంతో దాడి - ఒకరు మృతి - ఇద్దరికి గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 11:57 AM IST

Attack on Three For Doing Black Magic in Village
Attack on Three For Doing Black Magic in Village (ETV Bharat)

Attack on Three For Doing Black Magic in Village : మెదక్​ జిల్లా టేక్మాల్​ మండలంలో దారుణం చోటుచేసుకుంది. బాణామతి చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురిపై గ్రామస్థులు దాడి చేశారు. అందులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్చారం మందాపుర్​కు చెందిన రాములు, బాలామణీ ఇటీవల గొల్లగూడానికి చెందిన గంగమ్మ వద్దకు వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి బాణామతి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులంతా కలిసి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు మహిళలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రాములు మృతదేహాన్ని, గాయపడిన ఇద్దరు మహిళలను సంగారెడ్డిలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.