ETV Bharat / snippets

కొడంగల్‌లో బీసీ విద్యాలయాల నిర్మాణానికి నిధుల విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 6:52 PM IST

BC VIDYALAYAS IN KODANGAL
Funds Released for Construction of BC Vidyalayas (ETV Bharat)

Funds Released for Construction of BC Vidyalayas : కొడంగల్ నియోజకవర్గంలో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 73 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అలాగే కొడంగల్‌లో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు, బీసీ గురుకుల పాఠశాల కోసం 23 కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరు చేసింది. బొమ్రాసిపేట మండలం బురాన్‌పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల, కాలేజీ నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.