ETV Bharat / snippets

రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు : ఐఎండీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 3:20 PM IST

Telangana Weather Update
Telangana Weather Update (ETV Bharat)

Telangana Weather Update : రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్​లోని గచ్చిబౌలి, కొత్తపేట్​, సరూర్​నగర్​లో, చంపాపేట్, సైదాబాద్​, మాదన్నపేటలో కూడా అక్కడక్కడ వాన జల్లులు పడుతున్నాయి. మలక్​పేట్​, చాదర్​ఘూట్​, ఎల్బీనగర్​లోను వానలు కురుస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.