ETV Bharat / snippets

'నివాసాలకు కి.మీ పరిధిలో ఉన్న స్పాంజ్‌ ఐరన్ యూనిట్లు ఏడాదిలోగా తరలించాలి'

High Court On Sponge Iron units
High Court On Sponge Iron units (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 10:32 PM IST

High Court On Sponge Iron units : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ అప్పాజీపల్లి తాండా గ్రామాల పరిసరాల్లో మానవ నివాసాలకు కిలోమీటరు పరిధి లోపల ఉన్న స్పాంజ్ ఐరన్ యూనిట్లను ఏడాదిలోగా తరలించాలంటూ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూనిట్లను తరలించిన తరువాత నివేదికను హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆదేశించింది. అంతేగాకుండా ఇక్కడ నడుస్తున్న మిగిలిన యూనిట్లు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా నడుస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి రెండు నెలల్లో హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌కు నివేదిక అందజేయాలని ఆదేశించింది. పంట నష్టాలకు పరిహారంగా పరిశ్రమలు డిపాజిట్ చేసిన సొమ్మును రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఇంకా ఇలా స్పాంజ్ ఐరన్ పరిశ్రమల వల్ల పంట నష్టపోయిన రైతులున్నట్లయితే చట్టప్రకారం వారిని గుర్తించి పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ 19 ఏళ్ల పిటిషన్‌పై విచారణను ముగించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.